Stock Market: లాభాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. ! 8 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో మొదలయ్యాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 200 పాయింట్లు లాభంతో, నిఫ్టీ 23,800 మార్కు వద్ద కదలాడుతుంది. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్ 315 పాయింట్లు పెరిగి 78,788 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 23,829 వద్ద కొనసాగుతుంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 85.24 వద్ద ఉంది.